ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాలను మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. కూరగాయల మార్కెట్లో సామాజిక దూరం పాటించాలని కోరారు. అత్యవసర సేవల సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విధులు నిర్వహించే సిబ్బందికి ఇంటికే సరకుల పంపిణి కోసం ఆలోచన చేస్తామన్నారు.
ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో జోగు రామన్న పర్యటన - jogu ramanna on corona virus
మహారాష్ట్రతో మూడోవైపు సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని వ్యాధి ప్రభావం తమపై పడకూడదనే ఆలోచనతో ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను కట్టుదిట్టం చేసుకునేలా చేస్తోంది. ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాలను మాజీ మంత్రి జోగురామన్న పరిశీలించారు.
jogu ramanna