తెలంగాణ

telangana

ETV Bharat / state

హోదా పక్కన పెట్టి.. ఉపాధ్యాయుడి పాడె మోసిన ఎమ్మెల్యేలు! - ఆదిలాబాద్​ పట్టణ వార్తలు

ఎమ్మెల్యే అంటే.. ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలను పరామర్శించడం సాధారణమే. కానీ.. ఆదిలాబాద్​ జిల్లాలో ఇందుకు భిన్నంగా ఓ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో మృతి చెందగా.. ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్​ ఎమ్మెల్యే రాథోడ్​ బాపూరావు స్వయంగా పాడె మోసి ఉపాధ్యాయుడికి అంత్యక్రియలు నిర్వహించారు.

MLA Jogu Ramanna, Rathod Bapu Rao Participated In Teacher Funeral
హోదా పక్కన పెట్టి.. ఉపాధ్యాయుడి పాడె మోసిన ఎమ్మెల్యేలు!

By

Published : Sep 6, 2020, 3:31 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని భూక్తాపూర్​ కాలనీలో నివాసముండే ప్రకాష్​ గౌడ్ హిందీ పండిట్​గా విధులు నిర్వహించేవారు. కాగా.. శనివారం అర్ధరాత్రి ఆయన అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్​ ఎమ్మెల్యే రాథోడ్​ బాపూరావు సరాసరి ప్రకాష్​ గౌడ్​ ఇంటికి వెళ్లారు. మృతదేహానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరికి సదరు ఉపాధ్యాయుడు బాల్య మిత్రుడు కాగా.. మరొకరికి సహచర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఎమ్మెల్యేలు కంటతడి పెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details