ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని కుమురం భీం కాలనీలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీల సభలో మాజీ ఎంపీ గోడం నగేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది: జోగు రామన్న - adilabad district latest news
ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని కుమురం భీం కాలనీలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సభ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది: జోగు రామన్న MLA Jogu Ramanna participating in the Tribal Meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9381941-589-9381941-1604152685919.jpg)
ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది: జోగు రామన్న
కరోనా వైరస్ ప్రబలకుండా ఉండి ఉంటే.. అర్హులైన ఆదివాసీలకు ఇప్పటికే అటవీ హక్కులు అంది ఉండేవని నేతలు పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు భీం విగ్రహానికి ఆదివాసీ సంప్రదాయరీతిలో నివాళులర్పించారు.
ఇదీ చూడండి.. కొడుకును సీఎం చేయడానికే ప్రచారం చేయట్లేదు: బండి సంజయ్