కరోనా మృతులకు అంత్యక్రియలు చేస్తున్న సఫాయి కార్మికుల సేవలు అమూల్యమైనవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలపై ఈటీవీ భారత్లో కథనం ప్రచురితం కాగా... ఎమ్మెల్యే తనయులు జోగు ప్రేమిందర్, జోగు మహేందర్ స్పందించారు.
కరోనా వేళ సఫాయి కార్మికుల సేవలు అమూల్యం: జోగు రామన్న - తెలంగాణ వార్తలు
కరోనా విపత్కర కాలంలో సఫాయి కార్మికుల సేవలు అమూల్యమైనవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను ఆయన క్యాంపు కార్యాలయానికి పిలిచి సన్మానించారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
పారిశుద్ధ్య కార్మికులకు జోగు రామన్న సన్మానం, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కార్మికులను పిలిపించి... వారిని సన్మానించారు. నెల రోజుల పాటు అవసరమయ్యే నిత్యవసర సరకులు అందజేశారు. విపత్కర కాలంలో వారి సేవలను కొనియాడారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: టీకా పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు