తెలంగాణ

telangana

ETV Bharat / state

గణేశ్ నిమజ్జనంలో.. ఎమ్మెల్యే జోగు రామన్న డాన్స్ - mla jogu ramanna dance in ganesh immersion

వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న భజన బృందంతో కలిసి ఆడిపాడారు. శోభయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తూ, పాడుతూ కార్యకర్తల్లో, స్థానికుల్లో ఉత్సాహం నింపారు.

mla jogu ramanna dance in ganesh immersion at adilabad
ఎమ్మెల్యే జోగు రామన్న డాన్స్

By

Published : Sep 15, 2021, 10:38 AM IST

ఆదిలాబాద్‌లో గణేశుని శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న.. జడ్పీ ఛైర్మన్​ రాథోడ్ జనార్దన్​తో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన శోభయాత్ర ఆద్యంతం ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

ఎమ్మెల్యే జోగు రామన్న డాన్స్

జడ్పీఛైర్మన్​తో కలిసి ఎమ్మెల్యే ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భజన బృందంతో ఆడి పాడారు. ఎమ్మెల్యే జోగురామన్న గుస్సాడీ నృత్యం చేసి అక్కడ వారిలో ఉత్తేజం నింపారు. పట్టణ పుర వీధుల గుండా శోభ యాత్ర చేసి.. వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ABOUT THE AUTHOR

...view details