తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువు నింపిన మిషన్​ భగీరథ నీరు - mission bhagiratha pipe burst in adilabad

ఇంటింటికి తాగు నీరు లక్ష్యంతో రూపొందించిన మిషన్​ భగీరథ ప్రాజెక్టు నీరు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల వృథాగా పోతోంది.

ఆదిలాబాద్​లో మిషన్​ భగీరథ పైపులైన్​ లీకేజీ

By

Published : Nov 7, 2019, 7:52 PM IST

ఆదిలాబాద్​లో మిషన్​ భగీరథ పైపులైన్​ లీకేజీ

ఆదిలాబాద్‌ జిల్లాలో మిషన్‌ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తలమడుగు మండలం సుంకిడి గ్రామగుట్టపై 250 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ట్యాంకు ద్వారా... తలమడుగు, తాంసి, భీంపూర్‌ మండలాలలోని109 గ్రామాలకు నీటి సరఫరా కావాల్సి ఉంది.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ట్యాంకుకు వచ్చి చేరుతున్న నీరు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పైపుల ద్వారా వృథాగా పోతోంది. దీంతో సుంకిడి గుట్టకింది భాగంలో నిరుపయోగంగా ఉన్న చెరువు నిండిపోయి జలకళను సంతరించుకుంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details