KTR Tweet: అంతర్జాతీయ అవార్డు గ్రహీత, చిత్ర నిర్మాత జెన్నిఫర్ ఆల్ఫోన్స్ సంకలనం చేసిన 'గుస్సాడి' పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పుస్తకం తెలంగాణలో జరుపుకునే గుస్సాడి, దండారి పండుగలకు సంబంధించిన సంప్రదాయాలు, నృత్య రూపాన్ని వర్ణిస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అధికారుల సహకారంతో ఫిల్మ్‌మేకర్ ఈ పుస్తకాన్ని అందించారని తెలిపారు.
KTR Tweet on Gussadi book :'గుస్సాడి పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది' - Minister KTR tweet Gussadi book
KTR Tweet on Gussadi book: అంతర్జాతీయ అవార్డు గ్రహీత జెన్నిఫర్ ఆల్ఫోన్స్ సంకలనం చేసిన 'గుస్సాడి' పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పుస్తకం తెలంగాణలో జరుపుకునే గుస్సాడి, దండారి పండుగలకు సంబంధించిన సంప్రదాయాలను, నృత్య రూపాన్ని వర్ణిస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.
KTR tweeted Gussadi book
పుస్తక విక్రయం ద్వారా వచ్చిన లాభాలు నేరుగా ఉట్నూరులోని ఐటీడీఏకు వెళ్తాయని చెప్పారు. ఆదివాసీలు వారి అందమైన సంస్కృతిని, పురాతన కళలు, చేతి పనులను కాపాడుకోవడంలో సహాయపడతాయన్నారు. ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో ఉందన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Last Updated : Dec 7, 2021, 6:25 AM IST