తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు వేదికలు పూర్తయితే అనేక ప్రయోజనాలు'

నిర్మల్ జిల్లా చిట్యాల్ గ్రామంలో మోడల్ రైతు వేదిక నిర్మాణం పూర్తి కాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. రైతు వేదిక నిర్మాణాన్ని తక్కువ కాలంలో పూర్తి చేసిన సర్పంచ్ పడకంటి రమేశ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

'రైతు వేదికలు పూర్తయితే అనేక ప్రయోజనాలు'
'రైతు వేదికలు పూర్తయితే అనేక ప్రయోజనాలు'

By

Published : Sep 28, 2020, 9:14 AM IST

రైతు వేదికల నిర్మాణం పూర్తయితే రైతులకు వ్యవసాయపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా చిట్యాల్ గ్రామంలో మోడల్ రైతు వేదిక నిర్మాణం పూర్తి కాగా మంత్రి సందర్శించారు. అన్ని వసతులతో మోడల్ రైతు వేదిక నిర్మాణాన్ని తక్కువ కాలంలో పూర్తి చేసిన సర్పంచ్ పడకంటి రమేశ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

రైతు వేదికలు జిల్లాలో 79 క్లస్టర్లలో నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. దసరా నాటికి అన్ని పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రైతు వేదికలు పూర్తయితే రైతులందరూ ఒకేచోట సమావేశమై వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను చర్చించుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'బీసీలకు అన్యాయం జరుగుతోంది.. వారిని సంఘటితం చేస్తా'

ABOUT THE AUTHOR

...view details