మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే వాళ్లు చట్టాన్ని పూర్తిగా చదువుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలను కాపాడతామనుకునే వాళ్లు మాత్రమే కౌన్సిలర్లుగా బరిలో దిగాలన్నారు. ఆదిలాబాద్ సమీపంలోని మావల అటవీ బ్లాక్ చుట్టూ రూ. 1.71 కోట్లతో చేపట్టిన కంచె నిర్మాణానికి... ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ దివ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం... నాటిన మొక్కలను కాపాడే బాధ్యత సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై ఏవిధంగా ఉంటుందో మున్సిపల్ కౌన్సిలర్లపై అంతే ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులకు... పొద్దున లేవగానే... మొక్కల ఆలనా, పాలనే కనిపించాలని హితవు పలికారు.
'మొక్కలను కాపాడేవాళ్లే మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలి' - మావల అటవీ బ్లాక్ చుట్టూ కంచె నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నాటిన మొక్కల్లో 85 శాతం కాపాడుతామనుకునే వాళ్లే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీచేయాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మావల అటవీ బ్లాక్ చుట్టూ రూ.1.71 కోట్లతో చేపట్టిన కంచె నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
'మొక్కలను కాపాడేవాళ్లే మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలి'