యాసంగి పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి పంటల ప్రణాళికపై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియంత్రిత పంటల సాగుపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
యాసంగి పంటల ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - minister indrakaran reddy
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. యాసంగి పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రధానంగా మొక్కజొన్న పంట నిల్వలు అధికంగా ఉన్నందున, ఆ పంటకు బదులు మిగిలిన ప్రత్యామ్నాయ పంటలైన శనగ, ప్రొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వు వంటి పంటలు పండించేలా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటించి రైతులు అధిక దిగుబడులు సాధించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.
ఇవీ చూడండి: 'ఆదేశాలు సరే... మరి నిధుల మాటేమిటి..?'