లాక్‌డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కొవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కొవిడ్ బాధితుల పట్ల ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
'రెమ్డెసివిర్ అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవు' - ఆదిలాబాద్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన
రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన లాక్‌డౌన్ అమలు, కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
minister indrakaran
జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ రాహుల్ రాజ్, ఇంఛార్జ్ ఎస్పీ రాజేశ్ చంద్ర... మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, రాఠోడ్ బాపూరావు, జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్, మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్