మిడతల దండు మహారాష్ట్ర నుంచి తొలుత ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రవేశించే అవకాశమున్నందున ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేశారు.
'మిడతల దండుపై అప్రమత్తంగా ఉండాలి' - Minister Review on locusts in Adilabad district
మిడతల దండును ఎదుర్కొనేందుకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మిడతల దండును సామూహికంగా నివారించే విషయంలో రైతులను చైతన్యం చేయాలని సూచించారు.
మిడతల దండుపై అప్రమత్తంగా ఉండాలి
సమీక్షలో జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాఠోడ్ బాపురావు, కలెక్టర్ శ్రీదేవసేన, ఇతర అధికారులు పాల్గొన్నారు.