తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుబంధు పథకంపై ఎలాంటి అపోహలు వద్దు'

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూరులో మంత్రి పర్యటించారు.

minister indra karan reddy about raithu bhandhu
'రైతుబంధు పథకంపై ఎలాంటి అపోహలు వద్దు'

By

Published : May 27, 2020, 2:43 PM IST

రైతు బంధు పథకంపై ఎలాంటి అపోహలు వద్దని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్​జిల్లా ఉట్నూరులో జడ్పీఛైర్మన్​ రాథోడ్​ జనార్ధన్​తో సమావేశమయ్యారు. ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు వర్షాకాలంలో పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు.

రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కరోనా వైరస్​ను నివారించేందుకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని సూచించారు. రైతులకు అన్ని రకాల విత్తనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రిని కలిసి సకాలంలో వేతనాలు చెల్లించాలని... ఏప్రిల్, మే మాసంలో పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు.

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details