కరోనా వ్యాధి నిరుపేదల పాలిట శాపంగా మారింది. బతుకు దెరువులో భాగంగా ఊరుకాని ఊరొచ్చిన వలసజీవులకు ఆకలితో అలమటించేలాచేస్తోంది. మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన ఓ నిరుపేద కుటుంబం చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను రూ.400లకు విక్రయించి ఆకలితీర్చుకుంటున్న దీనిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
కరోనా ఎఫెక్ట్: ఆకలిని తట్టుకోలేక రూ.400లకు ఫోన్ విక్రయం - ఆకలిని తట్టుకోలేక రూ.400 ఫోన్ విక్రయం
కరోనా ఎవరిని వదలట్లేదు. ఈ మహమ్మారి దెబ్బ అన్ని రంగాలపై పడింది. ఇప్పుడు దీని ప్రభావం వలస కూలీలపై పడింది. బతుకు తెరువు కోసం ఉన్న ఊళ్లను వదిలి తెలంగాణ రాష్ట్రాన్నికి వచ్చిన వలస కూలీలు తిరిగి తమ గ్రామాలకు చేరుకునేందుకు నానావస్థలు పడుతున్నారు. తినటానికి తిండి దొరక్క చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను రూ.400లకు విక్రయించి ఆకలి తీర్చుకుంటున్నారు ఓ నిరుపేద కుంటుంబం.
బతుకు...మెతులకు పెరుగుతున్న దూరం