తెలంగాణ

telangana

ETV Bharat / state

కడుపునిండా 'చదువు'

ఆ కళాశాలలో చదువుతో పాటు కడుపునిండా అన్నం పెట్టి పంపిస్తారు. ఇంతకీ అదెక్కడో తెలుసా..? ఈ స్టోరీ చదవండి.

By

Published : Feb 17, 2019, 8:57 PM IST

ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం

నాలుగేళ్లుగా కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం
ఆదిలాబాద్ పట్టణంలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. చుట్టుపక్కల ఐదారు మండలాలలోని విద్యార్థులకు ఇవే పెద్దదిక్కు. ఈ కళాశాలల్లో రెండు పూటల తరగతులు నడుస్తాయి. ఉదయం వేళ వచ్చే విద్యార్థులు తినకుండా ఉండటం వల్ల మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటిముఖం పట్టేవారు.

ఇది గమనించిన అధ్యాపకులు కనీసం పరీక్షల సమయంలో మధ్యాన్న భోజనం పెడితే ఫలితం ఉంటుందని భావించి అప్పటి కలెక్టర్ జగన్మోహన్​ను సంప్రదించారు. ఆయన సానుకూలంగా స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఆ ఆనవాయితీని ప్రస్తుత కలెక్టర్ దివ్య దేవరాజన్ కొనసాగించడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కళాశాలలో మధ్యాన్న భోజనం అమలు వల్ల హాజరు శాతం పెరగటంతో పాటు ఫలితాలు బాగా వస్తున్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యా రంగానికి పెద్ద పీట వేస్తామంటున్న ప్రభుత్వం, డిగ్రీ కళాశాలల్లో మధ్యాన్న భోజన పథకం అమలు చేస్తే పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details