ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా దేవత ఆశీస్సులతోనే తనకు అవార్డు వచ్చిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్త్రం వంశస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు.
పద్మశ్రీ కనకరాజుకు మెస్త్రం వంశస్థుల సన్మానం
39 ఏళ్ల తర్వాత కేంద్రప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమని పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్త్రం వంశస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు.
పద్మశ్రీ కనకరాజును సన్మానించిన మెస్త్రం వంశస్థులు
ఆలయంలోకి మెస్త్రం వంశీయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాగోబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 39 ఏళ్ల తర్వాత కేంద్రప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమని కనకరాజు తెలిపారు. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడి నృత్యం ప్రాధాన్యతను రానున్న తరాలవారికి అందించాలని అన్నారు.
ఇదీ చదవండి: దైవారాధనలకు విష్ణు.. పుణ్యస్నానాలకు లక్ష్మీ పుష్కరిణులు