ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో మహిళలు గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. చెట్లనుంచి ఆకులను సేకరించి గోరింటాకు రుబ్బి ఒకరికొకరు మెహందీ పెట్టుకున్నారు. భక్తి గీతాలు పాడుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. ప్రతి సంవత్సరం ఇలానే వేడుకలు జరుపుకుంటామని వెల్లడించారు.
గోరింటాకుతో ఆరోగ్యం...మహిళల ఆనందం - adilabad
ఆచారపరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా గోరింటాకు మంచిందని ఇచ్చోడలోని మహిళలు చెబుతున్నారు. ఆషాడమాసం సందర్భంగా గోరింటాకు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గోరింటాకుతో ఆరోగ్యం...మహిళల ఆనందం