కేంద్రం ఆర్టికల్ 370 ఎందుకు రద్దుచేసిందనే అంశంపై క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భాజపా ప్రణాళికలో భాగంగా ఆ పార్టీ నేతలు ఆదిలాబాద్‌లో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఉద్యోగ, మహిళా, విద్యార్థి, యువజన, న్యాయవాదులు, అధ్యాపక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కేంద్రప్రభుత్వం అమలు చేసిన నిర్ణయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. జన్ సంఘ వ్యవస్థాకుడు శ్యామాప్రసాధ్ ముఖర్జీ ఆశించినట్లుగానే కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిందనీ, ఎక్కడా ఓ రక్తం బొట్టు చిందకుండా..., 70 ఏళ్ల చరిత్రను కేంద్రం ప్రజాస్వామిక పద్ధతిలో తనకున్న సర్వాధికారాలను వినియోగించుకొని తిరిగరాసిందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందునే దేశంలో నరేంద్రమోదీ మరోసారి గెలువగలిగారని సోయం బాపూరావు అన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సబబేనని అభిప్రాయపడ్డారు.
'కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సబబే' - 'కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సబబే'
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు సబబేనని భాజపా నేతలు పేర్కొన్నారు. ఇది విశాల భారతదేశ సమగ్రతకు చిహ్నమని అభివర్ణించారు. ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా కమిటీ ..వివిధ వర్గాలతో పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు చర్చాగోష్ఠి నిర్వహించారు.
!['కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సబబే'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4586804-thumbnail-3x2-bjp-rk.jpg)
'కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సబబే'
Last Updated : Sep 29, 2019, 12:42 AM IST
TAGGED:
BJP_ARTICLE_370_CHARCHAGOSTI