తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనులకు కావేరి ఫౌండేషన్ చేయూత

ఓ వైపు కరోనా... మరోవైపు లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలను నిర్మల్ జిల్లాకు చెందిన అప్పాల కావేరి ఫౌండేషన్ చేదోడు వాదోడుగా నిలిచింది.

medicines and essential goods distributed to tribals by kaveri foundation
గిరిజనులకు కావేరి ఫౌండేషన్ చేయూత

By

Published : May 23, 2021, 7:45 PM IST

ఆదిలాబాద్ జిల్లా గాదిగుడా, నార్నూర్ మండలాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు అప్పాల కావేరి ఫౌండేషన్ సభ్యులు నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే మల్టీ విటమిన్, ఐరన్, కాల్షియం మాత్రలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో పనులు లేకపోవడం వల్ల పూటగడవని పరిస్థితి నెలకొంది. రక్తలేమి, పౌష్టికాహార పదార్థాల లోపాలున్న వారు మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

అప్పాల కావేరి ఫౌండేషన్​ ఛైర్మన్​ డా.అప్పాల చక్రధారి అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గిరిజనులకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించారు. 18 గ్రామాల్లో 300కు పైగా కుటుంబాలను సందర్శించి ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో శనగపప్పు, నూనె ప్యాకెట్​తో పాటు... పిల్లలకు అరటి పండ్లు, బిస్కట్లు అందజేశారు.

ఇదీ చదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం

ABOUT THE AUTHOR

...view details