కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది మాటలు చెప్తారు. ఇందుకు భిన్నంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి ఎంపీటీసీ మాత్రం చేతల్లో చూపారు. తన పరిధిలోకి వచ్చే జామిడి గ్రామంలో 100మంది ఉపాధి కూలీలకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించాలని కోరారు.
ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేసిన ఎంపీటీసీ - తెలంగాణ వార్తలు
ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు ఓ ఎంపీటీసీ మాస్కులు పంపిణీ చేశారు. శానిటైజర్ అందజేస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మాస్కుల పంపిణీ, మాస్కులు పంపిణీ చేసిన ఎంపీటీసీ
కరోనా వైరస్ విస్తరించకుండా తాము తగు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో ఇలా ఆచరణాత్మక అడుగులు వేస్తే సత్ఫలితాలు ఉంటాయని అంటున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణలో రికార్డుస్థాయి కేసులు.. ఒక్కరోజే 4,446 మందికి పాజిటివ్