ఆదిలాబాద్ పట్టణం గడియర్ మహల్‌కి చెందిన వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె భర్తతో పాటు పలువురిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో ఒకరు మైనర్ కావడం వల్ల ఆ బాలుడిని జువైనల్ కోర్టుకు అప్పగించారు.
వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పలువురు అరెస్టు - adilabad district news
వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె భర్తతో పాటు పలువురిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి మరికొందరిపై కేసు నమోదు చేశారు.
వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పలువురు అరెస్టు
బాధితురాలితో పాటు గాయపడ్డ క్షతగాత్రులను భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: మతిస్థిమితం కోల్పోయి జలాశయంలో పడి మహిళ మృతి