ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల సర్వసభ్య సమావేశం గందరగోళానికి దారితీసింది. ఈ భేటీలో తెరాస, భాజపా శ్రేణులు గొడవకు దిగాయి. స్థానిక శాసనసభ్యులు జోగు రామన్న నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ పరిస్థితి నెలకొంది. సమావేశ మందిరం నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న బయటకు వెళ్లే క్రమంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి.
మండలంలోని ఆడ గ్రామ సర్పంచ్ అయిన భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తనయుడైన పాయల్ శరత్ ప్రత్యేక అభివృద్ధి ఫండ్ (ఎస్‌డీఎఫ్) నిధుల వినియోగంపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే సిఫారసు తెస్తేనే అధికారులు.. నిధులు కేటాయిస్తామంటున్నారని శరత్ ప్రశ్నించారు.