అమాయక మహిళలే లక్ష్యంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తూ వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మంచిర్యాల మందమర్రి పోలీసులు అరెస్టు చేశారు. ఉట్నూర్ మండలం షాంపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఐటీడీఏ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసేవాడు. నిధులు అవకతవకలపై 2017లో అతన్ని అధికారులు విధుల నుంచి తొలగించారు.అ ప్పటి నుంచి ఖాళీగా ఉంటూ అమాయక మహిళలపై వల విసరడమే వృత్తిగా పెట్టుకున్నాడు.
తాను కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తానని చెబుతూ ఉద్యోగాలు ఇస్తానని పదోన్నతులు కల్పిస్తామని వందలాది మంది మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారి ఫోటోలు, నగ్న చిత్రాలు, వీడియోలను సేకరిస్తూ వారిని బెదిరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు.