తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉల్లిగడ్డ తిని, సల్ల తాగి సల్లగుండుర్రి' - JOGU RAMANNA

సల్ల తాగండి... ఉల్లిగడ్డలు జేబులో పెట్టుకోండి... ఇదేదో ఆరోగ్య నిపుణుడి సలహా కాదు.. రాజకీయ నాయకులది. భానుడి బారిన పడకుండా ఉండేందుకు మజ్జిగ ప్యాకెట్లు, ఉల్లిగడ్డలు దగ్గర ఉంచుకోవాలని అందిస్తున్నారు ఆదిలాబాద్ నాయకులు.

'ఉల్లిగడ్డ తిని, మజ్జిగ తాగి సల్లగుండుర్రి'

By

Published : Mar 29, 2019, 7:56 PM IST

'ఉల్లిగడ్డ తిని, మజ్జిగ తాగి సల్లగుండుర్రి'
లోక్‌సభ ఎన్నికలకు సమయం తక్కువ ఉండటం... ఎండాకాలం కావడంతో నేతలు, కార్యకర్తలు తెగకష్టపడిపోతున్నారు. ఓ వైపు ప్రచారంముమ్మరం చేస్తూనే... వడదెబ్బ తగలకుండా సంప్రదాయ ప్రయోగాలు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే జోగు రామన్న. ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు, అభిమానులందిరికీ ఉల్లిగడ్డలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. మజ్జిగ తాగాలని, ఉల్లిగడ్డలను జేబులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల కోసం తీసుకురావాల్సిన సంక్షేమ పథకాల గురించే కాకుండా తమ వెంట వస్తున్న కార్యకర్తల గురించి కూడా పట్టించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details