తెలంగాణ

telangana

ETV Bharat / state

Maharashtra Car Accident Today : మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం

Maharashtra Car Accident Today : వీకెండ్ విహారం నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. భీకర వర్షంలో ఘాటు రోడ్డు ఎక్కే సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రయాణికులంతా తెలంగాణ వాసులేనని పోలీసులు తెలిపారు.

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 2:10 PM IST

Updated : Sep 17, 2023, 2:23 PM IST

Amravati Car Accident Today
Maharashtra Car Accident Today

Maharashtra Car Accident Today :మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో నలుగురు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)కి చెందిన డ్రైవర్ షేక్ సల్మాన్, అదే గ్రామానికి చెందిన మరో యువకుడు గొల్లి వైభవ్ యాదవ్‌తో పాటు అర్లి, భీంపూర్, కప్పర్ల, పెండల్‌వాడ, బేలా ప్రాంతాలకు చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు కోటేశ్వర్, శివకృష్ణ, శ్యామ్‌లింగా రెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్‌లు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని ఓ జలపాతాన్ని(Dharkhora Waterfall Melghat) చూసేందుకు వెళ్లారు.

Amravati Car Accident Today :ఇవాళ ఆదివారం, రేపు సోమవారం వినాయకచవితి(Ganesh Chaturthi 2023) కావడంతో రెండ్రోజులు వీకెండ్ విహారానికి వెళ్లారు. జాలీగా.. హ్యాపీగా.. ఎంజాయ్ చేస్తూ తమ విహారయాత్ర కోసం బయల్దేరారు. ఈ రెండ్రోజులు ఎక్కిడికి వెళ్లాలి.. ఏం చేయాలని అని పక్కా ప్లాన్ చేసుకుని మరీ వెళ్లారు. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా వర్షం మొదలైంది. భీకర వర్షంలో వెళ్లడం ప్రమాదమని భావించి కాస్త ముందుకెళ్లాక కారును ఓ చోట నిలుపుదామనుకున్నారు. అలా కారులో ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్‌దరా వద్దకు చేరుకున్నారు.

Car Accident in Siddipet : ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి.. ఏడుగురు పరిస్థితి విషమం

Maharashtra Car Accident Updates : ఆ ప్రాంతమంతా ఘాట్‌రోడ్డు కావడం.. ఓవైపు భీకరంగా వాన కురుస్తుండటంతో చికల్ దరా ఘాట్ రోడ్డు ఎక్కే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్ననలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన శ్యామ్‌లింగా రెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్‌లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను డ్రైవర్ షేక్ సల్మాన్(28), శివకృష్ణ(30), వైభవ్ లక్ష్మణ్(29), కోటేశ్వర్ రావు(27) పోలీసులు గుర్తించారు.

'మేమంతా అమరావతిలో జలపాతం చూడటానికి కారులో బయల్దేరాం. మార్గమధ్యలో వర్షం మొదలైంది. వాన కురుస్తోందని నెమ్మదిగానే వాహనం నడిపాడు డ్రైవర్. చికల్‌దరా వద్దకు రాగానే అక్కడ మొత్తం ఘాట్‌రోడ్డు కనిపించింది. నెమ్మదిగానే ఆ రోడ్డుపైకి ఎక్కించాడు డ్రైవర్. కానీ వర్షం వల్ల డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో మా కారు అక్కడే ఉన్న లోయలో పడిపోయింది. నాకు తలకు, కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఏమైందో అర్థమయ్యేలోగా నా పక్కనే నా ఫ్రెండ్స్ నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వాళ్లని తట్టిలేపినా స్పందన లేదు. ఇంకో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే మేం అంబులెన్స్‌కు కాల్ చేశాం.' అని గాయపడిన ఓ వ్యక్తి తెలిపారు.

Posthumous Degree to Jaahnavi Kandula : మరణానంతరం జాహ్నవికి డిగ్రీ.. అమెరికా యూనివర్సిటీ వీసీ ప్రకటన

US Cop Caught On Tape Laughing : 'ఆమె విలువ తక్కువే'.. తెలుగు యువతి మృతిపై అమెరికా పోలీసు అహంకారం.. జోకులు వేసుకుంటూ..

Last Updated : Sep 17, 2023, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details