నిబంధనలు సడలింపుతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లాక్‌డౌన్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. గ్రామాలు, మండల కేంద్రాల్లో దాదాపు అన్ని దుకాణాలు తెరచుకోగా.. పట్టణాల్లో 50శాతం దుకాణాలు మాత్రమే తెరవాలన్న అంశంపై స్పష్టత కరవైంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే కార్యాలయాలకు వచ్చేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం 40 స్లాట్ బుకింగ్ లు మాత్రమే అవకాశం ఇస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. రెండో రోజు మద్యం విక్రయాలు జరిగినా.. దుకాణాల వద్ద రద్దీ తగ్గింది. మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ మద్యం ప్రియులు మద్యాన్ని కొనుగోలు చేశారు. హన్మకొండ, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రికల్, స్టీల్, హార్డ్ వేర్ దుకాణాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్‌లో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటి రెడ్డిలు కలియ తిరుగుతూ సరి, బేరి విధానం అమలు అవుతున్న తీరును పరిశీలించారు. నిబంధనలు పాటించని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.