ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 47 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... అరగంట పాటు మందకొడిగా సాగింది. అనంతరం పుంజుకుంది. 124, 133 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ గంటపాటు ఆలస్యమైంది. ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొందరు ఓటర్లు పోలింగ్ స్లిప్పులు లేవంటూ ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నట్లయితే ఓటు వేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఇచ్చోడలో కాసేపు మొరాయించిన ఈవీఎంలు - loksabhapoling
ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలుచోట్ల పోలింగ్ చీటీలు రాలేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. స్లిప్పులు లేకున్నా... ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
పోలింగ్ ప్రశాంతం