కరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో ఆర్టీసీ డిపోలున్నాయి. ఇందులో మొత్తం 625 బస్సులు ఉండగా 2 వేల 590 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు రోజుకు కనీసం 300 బస్సులకు మించి తిరగడం లేదు. ప్రయాణికులతో కళకళలాడే బస్టాండ్‌లలో రద్దీ బాగా తగ్గిపోయింది. రోజుకు సగటున కోటి రూపాయల వరకు వచ్చే ఆదాయం ఇప్పుడు 40 లక్షలకు మించడంలేదు.
క్లరికల్ విధులు..
సీనియర్ డ్రైవర్లు, కండక్టర్లు సైతం ఇప్పుడు క్లరికల్ విధులు నిర్వహించాల్సి వస్తోంది. కొంతమంది డీజిల్ ట్యాంకుల్లో, మరికొంత మంది రికార్డు అసిస్టెంట్లుగా, కొందరు రిజర్వేషన్ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. ఈ విధులన్నీ గతంలో ఒప్పంద కార్మికులు నిర్వహించేవారు. కరోనా కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో వారి స్థానంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు.
దూరప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. ఉద్యోగులందరూ విధులకు హాజరవుతున్నప్పటికీ బస్సుల సంఖ్య పరిమితంగానే ఉండడంతో... మునుపటిలాగా డ్యూటీ కేటాయించే పరిస్థితిలేదు.
ఇదీ చూడండి: భాజపా ఎంపీ అశోక్ గస్తి కన్నుమూత