'మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం' - ఆదిలాబాద్
ఊరు, వాడ, పాఠశాలలతో పాటు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ సూచించారు.
'మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం'
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని గంగన్న పేట ప్రాథమిక పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జనార్దన్, ఉట్నూరు ఎంపీపీ జయవంత్ రావు పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జడ్పీ చైర్మన్ హామీ ఇచ్చారు.