లాక్డౌన్ వల్ల రెండున్నర నెలల పాటు మూతపడిన ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి భయపడిన భక్తులు పదుల సంఖ్యలోనే దర్శనమిచ్చారు. ఆలయాల్లో ఎలాంటి అభిషేకాలు గానీ, గుడిగంటలు మోగించకూడదనే కేంద్ర సూచనలను ఆదిలాబాద్ జిల్లాలో భక్తులు పాటిస్తూ మూలవిరాట్టును దర్శించుకున్నారు.
తెరుచుకున్న ఆలయాలు.. భౌతికదూరంలో భక్తులు - temples open in adilabad district
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. కోరనాకు భయపడిన భక్తులు అంతంతమాత్రంగానే దర్శనమిచ్చారు. వచ్చిన భక్తులు మాస్కులు ధరించాలని అధికారులు నిబంధనలు పెట్టారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే దర్శనానికి అనుమతిస్తున్నారు.
![తెరుచుకున్న ఆలయాలు.. భౌతికదూరంలో భక్తులు less devotees in adilabad temples which opened after lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7524171-353-7524171-1591601471306.jpg)
తెరుచుకున్న ఆలయాలు.. పదుల సంఖ్యలో భక్తులు
పట్టణంలోని అన్ని మందిరాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాక, మాస్కులు ధరిస్తేనే లోనికి వెళ్లేందుకు అనుతిస్తున్నారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా అధికారులు గుండ్రటి సున్నాలు గీశారు. పదేళ్లలోపు చిన్నారులు, అరవై ఏళ్లు దాటిన వృద్ధులను అనుమతించట్లేదని ఆలయాల అధికారులు వెల్లడించారు.