చిరుతపులిని భయపెట్టిన ఆదిలాబాద్ రైతు - Leopard in Adilabad District
09:49 January 30
చిరుతపులిని భయపెట్టిన ఆదిలాబాద్ రైతు
ఈ మధ్య కాలంలో జిల్లా శివార్లలో చిరుతల సంచారం పెరిగింది. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. పొలం పనులకు వెళ్లే రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం భయపడుతునే ఉన్నారు. కానీ ఆదిలాబాద్‌లో ఓ రైతు చిరుతనే భయపెట్టాడు.
అసలేం జరిగిందంటే?
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటి గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్లి పంచాయతీ శాంతి నగర్‌కు చెందిన గిరిజన రైతు ఆత్రం రామ్ కిషన్ ఉదయం వేళ ఎద్దులను పంట చేనుకు తీసుకెళ్లి పనిలో నిమగ్నమవగా చిరుత పులి వచ్చి ఓ ఎద్దుపై దాడి చేసింది. ఇది గమనించిన సదరు రైతు అడవి పందులను పారదోలేందుకు ఉపయోగించే టపాసులను చిరుతపై వేసి అది పారిపోయేలా ధైర్యం ప్రదర్శించారు. ఆ ప్రయత్నం సఫలం కావడం వల్ల చిరుత పశువును వదిలి పారిపోయింది. దీనితో పశువుతో పాటు తన ప్రాణాలు దక్కించుకున్నట్లు బాధిత రైతు పేర్కొన్నారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.