తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నెర్ర చేసిన కంది రైతులు - FARMERS PROTEST IN TELANGANA

ఆదిలాబాద్‌ జిల్లాలో కంది రైతులు భగ్గుమన్నారు. ఈ రోజు అధికారులు కందుల కొనుగోళ్లకు ముందుకు రాకపోయేసరికి జైనథ్‌లో రైతులంతా మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు.

FARMERS PROTEST IN ADHILABAD
FARMERS PROTEST IN ADHILABAD

By

Published : Feb 28, 2020, 5:25 PM IST

Updated : Feb 28, 2020, 6:16 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో కంది రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నిన్న ఆదిలాబాద్‌, తలమడుగు, జైనథ్‌, బేల మండలాల్లో కంది రైతులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. అధికారులు సర్ధిచెప్పగా ఆందోళన కాస్తంత సద్దుమనిగింది. ఈ రోజు అధికారులు కందుల కొనుగోళ్లకు ముందుకురాకపోయేసరికి.. జైనథ్‌లో రైతులంతా మూకుమ్మడిగా ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదిలాబాద్‌ ఆర్డీఓ సూర్యనారాయణ, మండల ప్రజాప్రతినిధులు నచ్చచెప్పిన రైతులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారులతో మాట్లాడి కందులను కొనుగోలు చేస్తామని అధికారులు భరోసా ఇచ్చాక, రైతులు ఆందోళన విరమించారు.

కన్నెర్ర చేసిన కంది రైతులు

ఇదీ చూడండి:ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు

Last Updated : Feb 28, 2020, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details