జల్, జంగిల్, జమీన్ కోసం నిజాం రక్కసి పాలనపై పోరాడి అమర వీరుడైన కుమురం భీం వర్ధంతిని ఆదిలాబాద్ ఉట్నూర్లో సంప్రదాయబద్దంగా నిర్వహించారు . ఉట్నూర్ మండలంతో పాటు పలు మండలాలకు చెందిన ఆదివాసి సంఘాల నాయకులు కలిసి కుమురం భీం విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించారు.
ఉట్నూర్లో సంప్రదాయబద్దంగా కుమురం భీం వర్ధంతి - kumuram bheem vardhanthi news
ఆదిలాబాద్ ఉట్నూర్లో కుుమురం భీం వర్ధంతి సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆదివాసీల వాద్యాల నడుమ సంప్రదాయ పూజలు నిర్వహించారు.
ఉట్నూర్లో సంప్రదాయబద్దంగా కుమురం భీం వర్ధంతి
అనంతరం ఆదివాసీల వాద్యాల నడుమ సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం ఐక్యంగా ఉంటూ కలిసి పోరాడుదామని నాయకులు పేర్కొన్నారు.