ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కిసాన్ మేళా నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో జలశక్తి అభియాన్ కార్యక్రమాలు, వ్యవసాయంలో ఉపయోగించే పద్ధతులపై పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, జిల్లా సహాయ పాలనాధికారి సంధ్యారాణి రైతులకు పలు సూచనలిచ్చారు. నీటిని పొదుపుగా వాడాలని ప్రతీ ఇంటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నీటి కుంటల ఏర్పాటు వల్ల భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ రకాల పంట ఉత్పత్తులను, మేలి రకం ఎరువులను ప్రదర్శనకు ఉంచి అవగాహన కల్పించారు.
మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో కిసాన్ మేళా
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు. రైతులకు పథకాలపై, వ్యవసాయంపై పలు విలువైన సూచనలిచ్చారు.
Kisan Mela under the Market Yard