తెలంగాణ

telangana

ETV Bharat / state

కస్తూర్బాల్లో  స్వయం ఉపాధి విద్య

బాలికల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఆదిలాబాద్​ జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ప్రజ్ఞా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వృత్తి విద్యకు సంబంధించిన తదితర ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఉపాధి రంగాల పట్ల ఆసక్తిని పెంచుతున్నారు.

pragna

By

Published : Feb 2, 2019, 7:27 PM IST

pragna
చదువుతో పాటు వృత్తి విద్యలో కూడా బాలికలు రాణిస్తున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రత్యేకంగా ప్రజ్ఞా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా వారోత్సవాల పేరుతో బాలికల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నారు.
లో కాస్ట్ నో కాస్ట్ పద్ధతిన అతి తక్కువ ధరలో లభించే వస్తువులు, పరికరాలతో అందమైన అలంకరణలు రూపొందిస్తున్నారు. కుట్లు, అల్లికలు, టైలరింగ్, మెహేంది, బ్యూటీ పార్లర్ తదితర ఉపాధి కార్యక్రమాలను బాలికలకు నేర్పుతున్నారు. అలాగే భారతదేశ చరిత్ర, తెలంగాణ సంస్కృతి సంప్రదాయలను వారికి వివరిస్తున్నారు.
ఈ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ నిరుపేద బాలికలకు చదువుతో పాటు నైపుణ్య విద్య , వృత్తి విద్య అందుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details