తెలంగాణలో నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత హోదాకు ఓ గ్రామ పంచాయతీ ఎంపికైంది. కేంద్ర జలవనరుల శాఖ స్వచ్చ భారత్ మిషన్ కింద ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా.కె గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, తదితర ప్రజా ప్రతినిధులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.
ముఖ్రా.కె గ్రామం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ఎంపిక అవ్వడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తాను కన్న కలలు ఈ గ్రామం ద్వారా నిజమవుతున్నాయని... ముఖ్రా.కె గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి, అధికారులను కేసీఆర్ అభినందించారు.