కార్గిల్ దివస్ సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
కార్గిల్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని దోబీకాలనీలో జాతీయ జెండాతో విద్యార్థులు, భాజపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతా కీ జై అంటూ దారిపొడువునా నినాదాలు చేశారు. అనంతరం అమర జవానుల పార్కు వద్ద నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పాల్గొన్నారు.