ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వర్షాల కోసం గ్రామస్థులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. ఎరువులు విత్తనాల డీలర్లు, సభ్యులు గ్రామంలోని పురవీధుల్లో కప్పతల్లి ఆట ఆడుతూ భాజా భజంత్రీలతో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు.
ఖరీఫ్ మొదలై పది రోజులు గడుస్తున్నా వర్షాలు కురవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలు బాగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
'వర్షాల కోసం కప్పతల్లి ఆట'
వానాకాలం మెుదలైనా సరైన వర్షాలు కురవడం లేదని ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు.
భాజా భజంత్రీలతో గ్రామ దేవతలకు జలాభిషేకం
ఇవీ చూడండి : పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్న గోదారమ్మ