తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎదుట జూడాలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగిరాక పోతే విధులు బహిష్కరించి ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Juda's Strike: ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట జూడాల నిరసన - జూనియర్ వైద్యుల సమ్మె
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎదుట జూడాలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం.. హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు.
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. డిమాండ్‌లపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. హామీ వస్తేనే విధుల్లో చేరతామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ.. జూనియర్ వైద్యులతో సమావేశమయ్యారు. జూడాలు తమ డిమాండ్లను రిజ్వీకి వివరించారు. సమావేశం అనంతరం.. నేటి సాయంత్రం సమ్మె విరమింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి:JUDA's Strike: ముగిసిన చర్చలు.. సమ్మె విరమణపై సాయంత్రం నిర్ణయం