ప్రభుత్వం ఏడు నెలలుగా గౌరవ భత్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ... ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. వైద్యకళాశాల ప్రధాన ద్వారం ఎదుట నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు.
రిమ్స్‌లో ఆందోళనకు దిగిన జుడాలు - రిమ్స్ తాజా వార్తలు
గౌరవ భత్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం నుంచి విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.
రిమ్స్‌లో ఆందోళనకు దిగిన జుడాలు
ఒక్కొక్కరికి రూ. లక్ష 40వేల వరకు బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించనట్లయితే ఈనెల 15 నుంచి విధులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి చికిత్స చేశామని చెప్పారు.