దేశంలో ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతా, ఖురాన్, బైబిల్ కంటే ఎక్కువ పవిత్రంగా చూసే ఏకైక పార్టీ తెరాసనేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి తెరాస, కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్నిఖండించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలువలేని భాజపా నేతలకు తెరాసను విమర్శించే హక్కులేదన్నారు. కేబినేట్లో మంత్రి పదవి రానందుకు బాధ లేదన్న జోగు రామన్న రెండోసారి జరిగే విస్తరణలో అవకాశం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
'భాజపాకు తెరాసను విమర్శించే హక్కులేదు' - MINISTER
మంత్రివర్గ విస్తరణలో స్థానం వచ్చినా, రాకపోయినా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను: జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
'భాజపాకు తెరాసను విమర్శించే హక్కులేదు'