ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లి గ్రామంలో సంప్రదాయ కళా ప్రదర్శన జడ కొప్పులాట ఆకట్టుకుంది. కోలాటం ఆడుతూ చీరలతో జడను అల్లడం ఈ ఆటలోని ప్రత్యేకత. 16 మంది జంటగా నాట్యమాడుతూ లయబద్ధంగా ముందుకు సాగుతూ వివిధ రకాల జడలు అల్లడం చూపరులను ఆకట్టుకుంది.
ఆర్లిలో కనులవిందుగా జడ కొప్పులాట ప్రదర్శన
ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లి గ్రామంలో జడ కొప్పులాట చూపరులను ఆకట్టుకుంది. కోలాటాలు చేస్తూ జడలు అల్లడం ఈ నృత్యం ప్రత్యేకత. ఈ కళా ప్రదర్శనను చూడడానికి జనాలు తరలివచ్చారు.
ఆర్లిలో కనువిందుగా జడ కొప్పులాట
మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా సరిహద్దులోని మహారాష్ట్ర వాసులు ఈ ఆటను తిలకించేందుకు తరలివచ్చారు. గ్రామంలో తొలుత ఊరేగింపు నిర్వహించారు.
ఇదీ చదవండి:ఐదు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల విజయం