ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కామాయంపేటలో ఐటీడీఏ, వైద్యాధికారులు పర్యటించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో భవిష్ మిశ్రా సూచించారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే.. వర్షపు నీరు నిల్వ ఉండదని, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అన్నారు.
ఇంటికో ఇంకుడు గుంత ఉండాలి: ఐటీడీఏ పీవో భవిష్ మిశ్రా - Adilabad News
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వర్షపు నిల్వనీరు ఉండకుండా చూసుకోవాలని ఐటీడీఏ పీవో భవిష్ మిశ్రా అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కామాయంపేటలో ఆయన ఏజెన్సీ అదనపు వైద్యాధికారితో కలిసి మండలంలో పర్యటించారు.
‘ఇంటికో ఇంకుడు గుంత ఉండాలి’
ఇందుకోసం ప్రజలంతా ఇంటింటా.. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. దోమల నుంచి కాపాడుకోడానికి దోమల తెరలు వాడాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉచితంగా దోమ తెరలు పంచుతామని అన్నారు. వైద్య సిబ్బంది నిత్యం పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి :వారం, పదిరోజుల్లో బ్యాంకుల్లో రైతుబంధు సొమ్ము: కేసీఆర్