అన్నలతో సంబంధం ఉందని తుడుందెబ్బను రాష్ట్రప్రభుత్వం నిషేధించడం బాధాకరమని ఆదిలాబాద్ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు పేర్కొన్నారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆపేదిలేదని స్పష్టంచేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన కుమురంభీం వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడి భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బను నిషేధించడంలో ప్రభుత్వం, అధికారుల పాత్రను దుయ్యబట్టారు. భీం స్ఫూర్తితో ఆదివాసీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, వారు సాగుచేస్తున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'తుడుందెబ్బను నిషేధించడం బాధాకరం' - It is painful to ban the Thudumdebba in Adilabad district
ఆదిలాబాద్ జిల్లా జరిగిన కుమురం భీం వర్ధంతి కార్యక్రమాన్నికి ఎంపీ సోయం బాపురావు పాల్గొన్ని నివాళులు ఆర్పించారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు తుడుందెబ్బ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు.
'తుడుందెబ్బను నిషేధించడం బాధాకరం'