తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఇంటర్‌ మూల్యాంకనం బహిష్కరణ - ఇంటర్‌ మూల్యాంకనం

కరోనా వైరస్ ప్రభావం ఇంటర్​ పరీక్షల మూల్యాంకనంపై కూడా పడింది. దీనివల్ల ఆదిలాబాద్​లో సుమారు 400మంది ఉపాధ్యాయులు మూల్యాంకన బాధ్యతలను సమూహికంగా బహిష్కరించారు.

Inter evaluation boycott in Adilabad district
కరోనా ఎఫెక్ట్: ఇంటర్‌ మూల్యాంకనం బహిష్కరణ

By

Published : Mar 21, 2020, 4:44 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంటర్‌ మూల్యాంకనంపై కరోనా ప్రభావం పడింది. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో మూల్యాంకన కేంద్రంగా గుర్తించారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకుగాను సుమారు 400మంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఇరుకుగదులు, ఎదురెదురుగా కూర్చుని విధులు నిర్వహించాల్సి రావటం వల్ల.. ఎక్కడా కరోనా వస్తుందోననే భయంతో మూల్యంకనానికి హాజరైన అధ్యాపకులంతా మూకుమ్మడిగా విధులను బహిష్కరించారు.

రోజురోజుకు కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో సమూహికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రోజూ బస్సుల్లో రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహించడం భయాన్ని కలిగిస్తోందంటూ అధ్యాపకులు వాపోయారు. ప్రభుత్వం మూల్యాంకనాన్ని వాయిదా వేయాలని కోరారు.

కరోనా ఎఫెక్ట్: ఇంటర్‌ మూల్యాంకనం బహిష్కరణ

ఇదీ చూడండి:కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

ABOUT THE AUTHOR

...view details