తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా​లో గాడి తప్పిన విద్యా శాఖ - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యాశాఖ గాడి తప్పుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత అధికారుల పోస్టుల భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా నెలరోజుల వ్యవధిలోనే ఎనిమిది మంది ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సస్పెన్షన్‌కు గురయ్యారు.

Indiscipline in adilabad education department
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా​లో గాడి తప్పిన విద్యా శాఖ

By

Published : Mar 4, 2021, 9:21 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా​లో గాడి తప్పిన విద్యా శాఖ

ఆదిలాబాద్‌ జిల్లా నాలుగు జిల్లాలుగా మారిన తర్వాత మండలాల సంఖ్య 70కి చేరింది. ఇందులో ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో 18 మండలాల చొప్పున ఉండగా... కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా 15, నిర్మల్‌ జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి. కుమురంభీం జిల్లాలోని కౌటాల మండలంలో ఒక్కరే రెగ్యులర్‌ మండల విద్యాధికారిగా విధులు నిర్వహిస్తుంటే... మిగిలిన 69 మండలాల పర్యవేక్షణ అంతా ఇంఛార్జీలతోనే నడుస్తోంది. ప్రధానంగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే అదనపు బాధ్యలు అప్పగించటంతో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై అజమాయిషీ లేకుండా పోతోంది.

ఉపాధ్యాయుల సస్పెన్షన్​

భీంపూర్‌, తాంసి, బేల మండలాల ఇంఛార్జీ ఎంఈవో నర్సింహులు ఇటీవల మద్యం సేవిస్తూ... పేకాట ఆడిన వీడియో వైరల్ కావటంతో ఆయనతో పాటు ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెన్షన్‌ చేశారు. అంతకు వారం ముందే తలమడుగు మండలం సుంకిడికి చెందిన బాలుణ్ని దండించిన లలిత అనే ఉపాధ్యాయురాలు సస్పెండ్‌ అయ్యారు. తాజాగా తాంసి మండలం ఘోట్కూరిలో ఖధీర్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించారని సస్పెండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఒక్కరే రెగ్యులర్‌ డీఈవో

ఇక మంచిర్యాల జిల్లాలో ఒక్కరే రెగ్యులర్‌ డీఈవో, మిగిలిన ఆదిలాబాద్, నిర్మల్‌, కుమురంభీం జిల్లాల డీఈవో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవటంతో ఇంఛార్జీలతోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. జిల్లాస్థాయిలో డీఈవో పోస్టులు, మండలస్థాయిలో ఎంఈవో పోస్టులు భర్తీకి నోచుకోకపోవటంతో... ఉపాధ్యాయుల విధులు నిర్వహణపై అజమాయిషీ కొరవడుతుందనే మాట ఉపాధ్యాయ వర్గాల్లో నుంచే వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: రబీలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు

ABOUT THE AUTHOR

...view details