తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిమాపక వారోత్సవాల్లో ఆకట్టుకున్న విన్యాసాలు

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిబ్బంది విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా నివారించాలో తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్​ అగ్నిమాపకశాఖ అధ్వర్వంలో కార్యక్రమం నిర్వహించారు.

Impressive stunts at the Fire Week
ఆదిలాబాద్​లో అగ్నిమాపక వారోత్సవాలు

By

Published : Apr 18, 2021, 4:55 PM IST

వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అగ్నిమాపక శాఖ అధికారులు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్​లో చేపట్టిన సిబ్బంది విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఎలా నివారించాలో తమ విన్యాసాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. పెట్రోల్‌ బంకులో ప్రమాదం జరిగితే ఏం చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. వారోత్సవాల సందర్భంగా అమరులను స్మరించుకుంటూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు.

ఇదీచూడండి:వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details