విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోరారు. స్పందించిన జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు.. సమస్య పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల పనితీరు బాగా లేదని ఫిర్యాదులు వస్తున్నట్లుగా ఎమ్మెల్యే సీడీపీఓ సౌందర్యకు తెలియజేయగా.. కేంద్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
'విద్యుత్ సమస్యలు పరిష్కరించండి' - ichoda manadal parishath meeting
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు హాజరయ్యారు. పలువురు సభ్యులు సమస్యలపై గలమెత్తారు.
మండల పరిషత్ సమావేశం