తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాలు.. భక్తుల రద్దీ - Adilabad Ttd Kalyana Mandapam latest News

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తితిదే కల్యాణ మండపం వద్ద తిరుమల శ్రీవారి లడ్డూ కోసం భక్తులు బారులు తీరారు. లడ్డూలు అందరికీ అందిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

అందరికీ లడ్డూలు అందిస్తాం : బోర్డు సభ్యుడు అనిల్
అందరికీ లడ్డూలు అందిస్తాం : బోర్డు సభ్యుడు అనిల్

By

Published : Jun 1, 2020, 3:23 PM IST

ఆదిలాబాద్ పట్టణంలో తితిదే కల్యాణ మండపం వద్ద తిరుపతి లడ్డూ కొనుగోలు కోసం భక్తులు బారులు తీరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమలేశుడి దర్శనాలు నిలిచిపోవడం వల్ల తితిదే లడ్డూలను అందుబాటులోకి తెచ్చింది.

మనిషికి రెండు లడ్డూలు..

ఈ నేపథ్యంలో లడ్డూల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో వ్యక్తికి రెండేసి లడ్డూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి బారులు తీరి వాటిని కొనుగోలు చేశారు. మండపంలోని ఏర్పాట్లను తితిదే ఆలయ కమిటీ సభ్యుడు అనిల్ పర్యవేక్షించారు. లడ్డూలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర: భట్టి

ABOUT THE AUTHOR

...view details