తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంక్షల సడలింపులతో ఉపాధి కూలీలకు ఊరట - lockdown effect in adilabad

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో లాక్​డౌన్​ ఆంక్షల సడలింపు కొన్ని వర్గాలకు ఊరటనిస్తోంది. పరిశ్రమ వ్యర్థాలతో కలుషితంగా మారిన గోదావరి.. లాక్​డౌన్​ పుణ్యమా అని.. స్వచ్ఛ జలాలుగా మారి పరుగులు తీస్తున్నాయి.

nrgs works
ఆంక్షల సడలింపు.. ఉపాధి కూలీలకు ఊరట

By

Published : Apr 30, 2020, 7:34 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులు కొన్ని వర్గాలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనుల్లేక ఇబ్బందుల పడుతున్న కూలీలకు ఉపాధి పనుల ప్రారంభం ఊరటనిస్తున్నాయి. మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభంతో.. అన్నదాతలకు కాస్త వెసులుబాటు కలిగింది.

లాక్​డౌన్​తో దక్షిణ గంగా నదిగా పేరొందిన గోదావరి నది స్వచ్ఛతను సంతరించుకుంది. నిర్మల్‌ జిల్లా బాసరలో అడుగుపెట్టే ఈ నది మంచిర్యాల జిల్లా గూడెం వరకు సుమారు 220 కి.మీ. మేర ప్రవహిస్తోంది. ఇదివరకు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితంగా మారి దుర్గందాన్ని వెదజల్లిన పరిసరాలు ... కరోనా కారణంగా స్వచ్ఛ జలాలుగా మారి పరుగులు తీస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల్లో ఆనందాన్ని నింపుతోంది.

ఇవీచూడండి:ఆ ఒంటెల ప్లాస్మాతో కరోనా​కు చికిత్స!

ABOUT THE AUTHOR

...view details